హీరో ఏ-47 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

ఇప్పుడు భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల యుగంగా మారిపోబోతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ టూ వీలర్లను మార్కెట్లోకి వదిలాయి. ఇంకా కొన్ని త్వరలో మార్కెట్ ను పలకరించబోతున్నాయి. తాజాగా ఆటో ఎక్స్ పో 2020 లో హీరో కంపెనీ తన నూతన ఎలక్ట్రిక్ బైక్ ను ప్రదర్శన కు ఉంచింది. ఏ-47 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గా పేర్కొన్న ఈ బైక్ ఆకట్టుకుంటోంది.

ఈ బైక్ లో 3.5 కేడబ్ల్యు హెచ్ బ్యాటరీ ఉంటుందట. ఇక ఈ బైక్ ఒకసారి చార్జీ చేస్తే 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది చెబుతున్నారు. అలాగే ఈ బైక్ 85 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోందంటున్నారు. ఇక బ్యాటరీని నాలుగు గంటలు ఛార్జింగ్ పెడితే ఫుల్ అయిపోతుంది!



 


Update: 2020-02-05 11:59 GMT

Linked news