Auto Expo 2020 Live Updates : సరికొత్త వాహనాల ప్రపంచానికి స్వాగతం!

Update: 2020-02-05 10:10 GMT

ఎప్పటికప్పుడు  వాహన కంపెనీలు కొత్త కొత్త వాహనాలను విడుదల చేస్తుంటాయి. అవి విడుదల చేయబోయే వాహనాలను ప్రదర్శించేందుకు రెండేళ్ళకోసారి ఆటో ఎక్స్ పో పేరుతో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. గ్రేటర్ నోయిడాలో  Auto Expo 2020 ఈరోజు (బుధవారం) ప్రారంభం అయింది.

ఈ సంవత్సరం వాహన తయారీ కంపెనీలకు కొత్త వాహనాలను విడుదల చేయడానికి చాలా అవాంతరాలు వచ్చాయి. గత సంవత్సరంలో అటో రంగంలో సంక్షోభం నెలకొంది. వాహనాల కొనుగోళ్ళు తగ్గాయి. ఈ నేపధ్యంలో అన్ని అవాంతరాలను తట్టుకుంటూ ఈ అటో ఎక్స్ పో ప్రారంభం అయింది. మరి ఈ ప్రదర్శనలో కొత్తకొత్తగా రాబోతున్న వాహనాలను మీరూ చూసేయండి. మన లైవ్ అప్డేట్స్ లో..


Live Updates
2020-02-05 12:14 GMT

ఎలక్ట్రిక్ కారు అంటే ఇలా ఉంటుంది అనేలాంటి కారును మారుతి త్వరలో మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. ఫ్యూచరో-ఈ పేరుతో 2021 లో మార్కెట్లోకి తీసుకురానున్న కారును ఆటో ఎక్స్ పో 2020 లో ప్రదర్శనకు ఉంచింది. ఈ కారు ఎలా ఉండబోతోందో చూడండి.


 

2020-02-05 11:59 GMT

ఇప్పుడు భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల యుగంగా మారిపోబోతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ టూ వీలర్లను మార్కెట్లోకి వదిలాయి. ఇంకా కొన్ని త్వరలో మార్కెట్ ను పలకరించబోతున్నాయి. తాజాగా ఆటో ఎక్స్ పో 2020 లో హీరో కంపెనీ తన నూతన ఎలక్ట్రిక్ బైక్ ను ప్రదర్శన కు ఉంచింది. ఏ-47 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గా పేర్కొన్న ఈ బైక్ ఆకట్టుకుంటోంది.

ఈ బైక్ లో 3.5 కేడబ్ల్యు హెచ్ బ్యాటరీ ఉంటుందట. ఇక ఈ బైక్ ఒకసారి చార్జీ చేస్తే 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది చెబుతున్నారు. అలాగే ఈ బైక్ 85 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోందంటున్నారు. ఇక బ్యాటరీని నాలుగు గంటలు ఛార్జింగ్ పెడితే ఫుల్ అయిపోతుంది!



 


2020-02-05 11:25 GMT

 టాటా మోటార్స్ 70 వ పుట్టినరోజు కానుకగా సియెర్రా సరికొత్త కారును ఎక్స్ పోలో ఉంచింది. చాలా అందంగా కనిపిస్తున్న ఈ ఎస్ యు వీ కారు ఆకట్టుకుంటోంది. 










 


 


 


 


2020-02-05 11:17 GMT

వోక్స్ వాగన్ టి-ఆర్ఓసి ఎస్యూవీ ప్రత్యేకతలు ఇవే!

- TSI పెట్రల్ ఇంజన్

-  7-స్పీడ్ DSG గేర్ బాక్స్

- 150 హెచ్ పీ పవర్

- 7 సీటర్ 

2020-02-05 11:11 GMT

వోక్స్ వాగన్ టి-ఆర్ఓసి ఎస్యూవీ 



 


2020-02-05 11:01 GMT

ఫన్‌స్టర్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన మహీంద్రా!









 


 


 


 



2020-02-05 10:56 GMT

మెర్సిడిజ్ బెంజ్ A 35 లిమోసిన్ సరికొత్త కారు సూర్యుని వెలుగుతో పోటీ పడుతోంది!






 


 


Tags:    

Similar News