లాక్‌డౌన్ 4.0 ఈరోజు నుంచే..
నాలుగో విడత లాక్‌డౌన్ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కేంద్రం ఈ దశ లాక్‌డౌన్ లో పలు సడలింపులు ప్రకటించింది. అయితే, ఆయా రాష్ట్రాలు అక్కడి పరిస్థితులను బట్టి ఈ సడలింపులను అమలు చేస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏపీ లో కేంద్ర గైడ్ లైన్స్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు, దీనిప్రకారం ఈరోజు నుంచి దాదాపుగా వాణిజ్య సంస్థలన్నీ పనిచేసే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులు కూడా ఈరోజు నుంచి రోడ్దేక్కనున్నాయి.
ఇక తెలంగాణాలో ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్ నిబంధనల సడలింపు పై తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక తెలంగాణాలో కూడా రేపట్నుంచి పరిమిత సంఖ్యలో బస్సులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.
Update: 2020-05-18 01:17 GMT