పెను తుపానుగా మారిన ఎంఫాన్ : ఏపీలో ఓ మోస్తరు వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ఎంఫాన్ మరింత బలపడి.. అత్యంత తీవ్ర తుఫాన్‌గా మారిందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎంఫాన్ ఉంది. ఇది వాయువ్య దిశలో వెళ్తూ మంగళవారం వేకువజామున ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. సుమారుగా బుధవారం బెంగాల్‌లోని సాగర్ దీవులు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటొచ్చంటోంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఏపీలో ఓ మోస్తరు వర్షాలకు మాత్రమే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

కాగా, ఈ తుపాను కారణంగా ఆంధ్రాలోనూ తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. 

Update: 2020-05-18 02:07 GMT

Linked news