విద్యుత్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కీలక నిర్ణయం!
జూన్ 30వరకు విద్యుత్ బిల్లుల చెల్లింపులు వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు బిల్లులు అత్యధికంగా వచ్చాయని వినియోగదారులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
దీనిపై ప్రభుత్వం ఇప్విపటికే విమర్శలు ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ సమయంలో వేలకు వేలు విద్యుత్తు బిల్లులు రావడంతో ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది..
ఈ నేపథ్యంలో విద్యుతు బిల్లుల చెల్లింపును జూన్ 30వ తేదీ వరకూ వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Update: 2020-05-14 03:10 GMT