Zomato: మరో సంచలనం.. జొమాటో విమానాలు వస్తున్నాయ్..!
Zomato: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వ్యవస్థాపకుల్లో ఒకరైన దీపీందర్ గోయెల్.. ల్యాబ్ ఏరో స్పేస్ భాగస్వామ్యంలో ప్రాంతీయ విమానయానంలో ప్రవేశించే ఆలోచన చేస్తున్నారు.
Zomato: మరో సంచలనం.. జొమాటో విమానాలు వస్తున్నాయ్..!
Zomato: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వ్యవస్థాపకుల్లో ఒకరైన దీపీందర్ గోయెల్.. ల్యాబ్ ఏరో స్పేస్ భాగస్వామ్యంలో ప్రాంతీయ విమానయానంలో ప్రవేశించే ఆలోచన చేస్తున్నారు. సగటు మానవులకు విమానాల్లో తిరిగే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ రంగంలోకి వస్తున్నట్లు జోమాటో వ్యవస్థాపకుల్లో మరొకరు సురోభి దాస్ లింక్డ్ ఇన్ ఒక పోస్ట్‌లో వెల్లడించారు.
ఇప్పటివరకు ఫుడ్ డెలివరీలో టాప్ ప్లేస్‌లో ఉన్న జొమాటో ఇక నుంచి ల్యాట్ ఏరో స్పేస్ భాగస్వామ్యంలో ప్రాంతీయ విమానయానంలో ప్రవేశించే యోచన చేస్తుంది. దీనికి సంబంధించి జొమాటో సహ వ్యవస్థాపకుడు సురోభి దాస్ లింక్డ్ ఇన్‌లో ఒక పోస్ట్ పెట్టారు. దేశంలో దాదాపుగా 450 ఎయిర్ స్ట్రిప్‌లలో 150 మాత్రమే పనిచేస్తున్నాయి. అంటే మూడింట రెండు వంతులు వృధాగానే పడి ఉన్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకొస్తే సామాన్యులకు కూడా తక్కువ ఖర్చుతో విమానాలు ఎక్కే అవకాశం దక్కుతుందని ఆమె అన్నారు.
అంతేకాదు, ల్యాట్ ఏరో స్పేస్ విమానాలు ఒక పార్కింగ్ లాట్‌తో సమానమైన విస్తీర్ణం ఉండే ఎయిర్ స్టాప్‌లలో టేకాఫ్, ల్యాండింగ్ కాగలవు. అందుకే వాటిని ఉపయోగించి సామాన్యులకు అందుబాటులోకి తేవాలని చూస్తున్నట్లు పోస్ట్ సురభి వెల్లడించారు.
జొమాటో వ్యవస్థాపకుల్లో ఒకరైన దిపీందర్ గోయల్ దీనికి ఇనీషియేట్ తీసుకుంటున్నారు. గోయల్ సుమారు 174 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశారు. నాన్ ఎగ్జిక్యూటివ్ సహ స్థాపకుడిగా మెంటర్ షిప్, స్ట్రాటజిక్ గైడెన్స్ అందిస్తారు. సురోభి దాస్ రోజువారీ వ్యవహారాలు చూసుకుంటారు. ఈ కంపెనీ 50 మిలియన్ డాలర్లను సేకరించాలని చూస్తోంది.