SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్‌.. మనీ విత్‌ డ్రా ఇలా మాత్రమే చేయండి..!

SBI Alert: SBI ఖాతాదారులు ఏటీఎం మోసాల బారిన పడకుండా రక్షణ కల్పించేందుకు బ్యాంకు ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది...

Update: 2022-04-13 07:00 GMT

SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్‌.. మనీ విత్‌ డ్రా ఇలా మాత్రమే చేయండి..!

SBI Alert: SBI ఖాతాదారులు ఏటీఎం మోసాల బారిన పడకుండా రక్షణ కల్పించేందుకు బ్యాంకు ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. వాస్తవానికి SBI ATMల నుంచి నగదు విత్‌ డ్రా నియమాలు మారాయి. ఏటీఎం లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు ఎస్‌బీఐ ఈ చర్య తీసుకుంది. ఇప్పుడు ఎస్‌బీఐ ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీని ఎంటర్ చేయడం తప్పనిసరి. మీరు ATM మోసాన్ని నివారించాలనుకుంటే బ్యాంకు ప్రత్యేక సౌకర్యాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. కొత్త రూల్ ప్రకారం.. కస్టమర్ OTP లేకుండా నగదు విత్‌డ్రా చేయలేరు.

నగదు విత్‌ డ్రా సమయంలో ఖాతాదారుల మొబైల్ ఫోన్‌కి OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే నగదు విత్‌డ్రా అవుతుంది. అయితే OTP ఆధారిత నగదు విత్‌డ్రా వ్యవస్థ సైబర్‌ నేరగాళ్లకి ఒక టీకా లాంటిదని బ్యాంక్ తెలియజేసింది. అయితే దీనిని ఎలా చేయాలో కస్టమర్లు తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించింది. అయితే10,000ల కంటే ఎక్కువ విత్‌ డ్రాపై మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. SBI కస్టమర్‌లు ATM నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వెళ్లినప్పుడు బ్యాంక్ ఖాతా నుంచి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాని పూర్తి ప్రక్రియను తెలుసుకుందాం.

SBI ATM నుంచి డబ్బులు విత్‌ డ్రా చేయడానికి OTP అవసరం. దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఈ OTP నాలుగు అంకెల నంబర్‌గా ఉంటుంది. ఇది ఒకే లావాదేవీ కోసం ఉపయోగపడుతుంది. మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ATM స్క్రీన్‌పై OTPని నమోదు చేయాలని అడుగుతుంది. డబ్బు విత్‌ డ్రా కోసం మీరు స్క్రీన్‌లో మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. అప్పుడే డబ్బులు డ్రా అవుతాయి.

Tags:    

Similar News