Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో ఎక్కువ సంపాదించవచ్చు.. కానీ ఈ మార్గాలు తెలిస్తేనే అది సాధ్యం..!

Fixed Deposits: పాత ఆర్థిక సంవత్సరం ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ప్రజలు సంపాదన కోసం కొత్త ఆర్థిక ప్రణాళికలు వేస్తున్నారు.

Update: 2022-04-03 10:30 GMT

Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో ఎక్కువ సంపాదించవచ్చు.. కానీ ఈ మార్గాలు తెలిస్తేనే అది సాధ్యం..!

Fixed Deposits: పాత ఆర్థిక సంవత్సరం ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ప్రజలు సంపాదన కోసం కొత్త ఆర్థిక ప్రణాళికలు వేస్తున్నారు. ఇందుకోసం ఎప్పుడో అన్వేషణ మొదలు పెట్టారు. తక్కువ రిస్క్‌తో ఎక్కువ ఆదాయం పొందే మార్గాల కోసం వెతుకుతున్నారు. అయితే ఇలాంటి ఆదాయం రావాలంటే ఎప్పటిలాగే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే బెస్ట్‌. కానీ వేరు వేరు పద్దతుల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఇందులోనే మంచి రాబడిని పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టబోతున్నట్లయితే మంచి ఆలోచన. కానీ మొత్తం డబ్బును ఒకే FDలో ఒకే సమయ వ్యవధిలో పెట్టుబడి పెట్టవద్దు. ఆ డబ్బుని విడదీయండి. ఒకటి కంటే ఎక్కువ ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టండి. వివిధ బ్యాంకుల వివిధ FD పథకాలలో పెట్టుబడి పెట్టండి. దీంతో మీరు ప్రతి బ్యాంకు నుంచి రూ. 5 లక్షల బీమా ప్రయోజనం పొందుతారు. ఒకవేళ డబ్బులు అత్యవసరం ఉండి తీసుకోవాలనుకంటే ఈ ఎఫ్డీల నుంచి ఏదో ఒకటి విత్‌ డ్రా చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మిగతా ఎఫ్డీలు సేఫ్‌గా ఉంటాయి. మీ అవసరాలు తీరినట్లు ఉంటుంది. నష్టం కూడా తక్కువగా ఉంటుంది.

ప్రత్యేక డిపాజిట్ పథకాలు

చాలా బ్యాంకులు 444 రోజులు లేదా 650 రోజులు లేదా 888 రోజుల పాటు ప్రత్యేక FD పథకాలను ప్రారంభిస్తాయి. ఈ పథకాలలో సాధారణ పథకాల కంటే బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి. మీరు అవగాహనతో అటువంటి పథకాన్ని ఎంచుకుంటే మీరు అధిక రాబడిని పొందవచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు పెద్ద బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి. 5 లక్షల వరకు బీమా కూడా ఇస్తారు. దీని ద్వారా మీరు అధిక రాబడిని పొందవచ్చు.

Tags:    

Similar News