Work From Home: ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ముగిసినట్లేనా..

Work From Home: కొవిడ్‌ మహమ్మారి వల్ల గత ఏడాది కాలంగా చాలామంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు.

Update: 2021-12-14 07:16 GMT

ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ముగిసినట్లేనా.. కంపెనీలు ఏం చెబుతున్నాయి..

Work From Home: కొవిడ్‌ మహమ్మారి వల్ల గత ఏడాది కాలంగా చాలామంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో ఇప్పుడు మళ్లీ కార్యాలయాల బాట పట్టారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోంకి బాగా అలవాటు పడ్డారు. దీంతో ఇప్పుడు కార్యాలయాలకు రావాలని పిలుపు రావడంతో అందరు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఫస్ట్‌వేవ్‌, సెకండ్‌ వేవ్‌ వెళ్లిపోయాయి. ప్రస్తుతం థర్డ్‌ వేవ్‌ అండ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయపెడుతుంది. అయితే ప్రభావం తక్కువగా ఉండటంతో కార్యాలయాలకు రావాలని ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారు.

నివేదికల ప్రకారం ప్రధాన ఐటీ కంపెనీలు ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావడానికి సన్నాహాలు ప్రారంభించాయి. దీని కోసం క్యాబ్‌లు ఏర్పాటుచేస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి కంపెనీలు కొంతమంది ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలవడాన్ని సిద్దంగా ఉన్నాయి. మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఇప్పుడు మన జీవితంలో శాశ్వత భాగమైపోయింది. వర్క్ ఫ్రం హోమ్ ఇలాగే ఉంటుందని అన్నారు. కరోనా ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు.

అయితే కొంతమంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కానీ తోటి ఉద్యోగులు వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని కండీషన్ పెడుతున్నారు. లేదంటే టీకాలు వేసుకున్నవారిని మాత్రమే కార్యాలయాలకు అనుమతించాలని కోరుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఇటీవల భారతదేశంతో సహా 33 దేశాలలో వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగులను సర్వే చేసింది. వీరిలో 78 శాతం మంది ఉద్యోగులు కార్యాలయంలో తమ సహోద్యోగులకు టీకాలు వేయించాలని పట్టుబట్టారు. 74 శాతం మంది సహాయక ఉద్యోగులకు టీకాలు వేయకపోతే వారికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని 81 శాతం మంది మాస్కులు ధరించాలని పట్టుబట్టారు.

Tags:    

Similar News