పాత పెన్షన్ స్కీమ్‌ మళ్లీ పునరుద్దరించబడుతుందా.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలుసుకోండి..!

Old Pension Scheme: పాత పెన్షన్ స్కీమ్ పునరుద్దనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివిధ చర్చలు జరుగుతున్నాయి.

Update: 2023-02-04 08:30 GMT

పాత పెన్షన్ స్కీమ్‌ మళ్లీ పునరుద్దరించబడుతుందా.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలుసుకోండి..!

Old Pension Scheme: పాత పెన్షన్ స్కీమ్ పునరుద్దనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివిధ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ పథకాన్ని కొన్ని రాష్ట్రాలలో పునరుద్దరించారు. అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దీనిని అమలు చేయాలనే డిమాండ్ జోరుగా కొనసాగుతోంది. పాత పెన్షన్ విధానంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పెద్ద ప్రకటన చేశారు. అలాగే పాత పెన్షన్‌ ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం.

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలు చేస్తే 2030 నాటికి భారతదేశం దివాళా తీస్తుందని పేర్కొన్నారు. 2006లో కూడా పాత పెన్షన్ స్కీమ్‌పై నిరసనలు వెల్లువెత్తాయని అన్నారు. భారతదేశ గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ 2006 సంవత్సరంలో పాత పెన్షన్ పథకం అమలుచేస్తే భారతదేశం వెనుకబడి పోతుందని చెప్పారని గుర్తుచేశారు.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, రాజస్థాన్ ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీంతోపాటు హిమాచల్ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. పాత పెన్షన్ పథకం అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే చివరిగా డ్రా చేసిన జీతం ఆధారంగా పెన్షన్‌ ఉంటుంది. అంటే దాదాపు రిటైర్మెంట్‌ సమయంలో వచ్చిన జీతంలో సగం పెన్షన్‌గా ఉంటుందని అంచనా. ఇది కాకుండా ద్రవ్యోల్బణం రేటు పెరగడంతో DA కూడా పెరుగుతుంది.

ఇటీవల ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ (CAPF) పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందుతారని తీర్పునిచ్చింది. వీరు సాయుధ దళంలో పనిచేస్తున్నందున ఈ వ్యక్తులు OPSకి అర్హులు అవుతారని కోర్టు తెలిపింది. న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది మాజీ సైనికులకు గొప్ప ఉపశమనం లభిస్తుందని అందరు భావిస్తున్నారు.

Tags:    

Similar News