Whisky Prices: మందుబాబులకు కిక్కెచ్చేవార్త..భారీగా తగ్గనున్న విస్కీ ధరలు

Update: 2025-05-30 04:23 GMT

Whisky Prices: మందుబాబులకు కిక్కెచ్చేవార్త..భారీగా తగ్గనున్న విస్కీ ధరలు

 Whisky Prices: మందుబాబులకు కిక్కు దించే వార్త కాదు..ఎక్కించే వార్త. ప్రస్తుతం మద్యం వ్యాపారం ఇండియా మొత్తమ్మీద చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పుడు విస్కీ ధరలు తగ్గనున్నాయన్న విషయంపై మద్యం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయి. విస్కీ ధరలు ఎందుకు తగ్గుతున్నాయో తెలుసుకుందాం.

భారతీయ రిటైల్ మార్కెట్లో త్వరలోనే స్కాచ్..విస్కీ ధరలు తగ్గునున్నాయని పెర్నోడ్ రికార్డ్ ఇండియా తెలిపింది. ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ స్కాచ్, విస్కీ తయారీ సంస్థ అయిన పెర్నాడ్ రికార్డ్ భారతీయ విభాగం పి.ఆర్.ఐ వ్యాపార ఒప్పందం తర్వాత పన్ను 75శాతం తగ్గిందని వెల్లడించింది. బ్రిటన్ తో కొత్త వ్యాపార ఒప్పందం వల్ల, దిగుమతి చేసుకుని విస్కీపై పన్ను తగ్గింది. దీంతో బ్రిటన్ నుంచి విస్కీ దిగుమతి ఖర్చు తగ్గడంతో ఇండియాలో విస్కీధరలు తగ్గనున్నాయన్న మాట.

పెర్నోడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ఫ్రెంచ్ కంపెనీ. ఇది పెర్నోడ్ రికార్డ్ ఎస్ఏ అనుబంధ సంస్థ. ఇది దేశంలో వైన్, స్పిరిట్స్ ఉత్పత్తి చేస్తుంది. పంపిణీ కూడాచేస్తుంది. సీగ్రామ్, రాయల్ స్టాక్, బ్లెండర్స్ ప్రైడ్, ఇతర బ్రాండ్ల వంటి పలు ప్రసిద్ధ స్పిరిట్స్ బ్రాండ్ల పోర్ట్ పోలియోను పెర్నోడ్ రికార్డ్ ఇండియా కలిగి ఉంది. వ్యాపార ఒప్పందం వల్ల, హై క్వాలిటీ స్కాచ్, ధరలు పోటీగా ఉంటాయి. ఇంపోర్టు ట్యాక్స్ తగ్గడంతో చాలా రాష్ట్రాల్లో రిటైల్ధరలు తగ్గుతాయని పిఆర్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరికీ ఈ చర్య ప్రయోజనం చేకూరుస్తుందని పీఆర్ఐ భావిస్తోంది. ట్యాక్స్ తగ్గింపు ద్వారా దిగుమతి చేసుకున్న స్కాచ్, విస్కీని అందరూ కొనుగోలు చేసేలా చూడాలని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఎక్కువ మంది విస్కీ కొనేలా ప్రత్యేక స్కీమ్స్ కూడా అమలు చేయనున్నాయని సమాచారం. 

Tags:    

Similar News