Home Loan: హొంలోన్ టర్మ్ ఎంత కాలం ఉంటే మంచిది?
Home Loan: హోంలోన్ టర్మ్ ఎక్కువ సంవత్సరాలు ఉంటే మంచిదా? తక్కువ టర్మ్ ఉంటే మంచిదా?
Home Loan: హొంలోన్ టర్మ్ ఎంత కాలం ఉంటే మంచిది?
Home Loan: హోంలోన్ టర్మ్ ఎక్కువ సంవత్సరాలు ఉంటే మంచిదా? తక్కువ టర్మ్ ఉంటే మంచిదా? అసలు ఆర్ధిక నిపుణులు ఏం చెబుతున్నారో ఒక్కసారి తెలుసుకుందాం.
సిబిల్ స్కోర్ ఆధారంగా ప్రైవేట్ ఉద్యోగులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి. సిబిల్ స్కోర్ ను బట్టే వడ్డీ కూడా ఉంటుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే వడ్డీ తగ్గే ఛాన్స్ కూడా ఉంది. సిబిల్ స్కోర్ బాగా లేకపోతే మాత్రం వడ్డీ రేటు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.
ఇకపోతే హోంలోన్ ఎక్కువ కాలం ఉంటే మంచిదా? తక్కువ కాలం ఉంటే మంచిదా? అనే చర్చకు సంబంధించి రుణ గ్రహీత ఆదాయాన్ని బట్టి దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కువ ఈఎంఐ పే చేసే ఆర్ధిక స్తోమత ఉంటే తక్కువ కాలం లోన్ టర్మ్ ను పెట్టుకోవచ్చు. తక్కువ ఈఎంఐతో ఎక్కువ టర్మ్ ను తీసుకోవచ్చు. అయితే ఇందులో లాభనష్టాల గురించి ఇప్పుడు చర్చిద్దాం.
రుణం తీసుకునే వ్యక్తి వయస్సు ఆధారంగా కూడా లోన్ టర్మ్ ఆధారపడి ఉంటుంది. 10, నుంచి 30 ఏళ్లవరకు కూడా హోంలోన్ గడువు పెట్టుకోవచ్చు. అయితే బ్యాంకులను బట్టి కూడా ఈ టర్మ్ ఆప్షన్ ఉంటుంది.
ఎక్కువ కాలం హోంలోన్ టర్మ్ గడువు పెట్టుకొంటే ఈఎంఐ తక్కువ పే చేయవచ్చు. కానీ మనం కట్టే ఈఎంఐలో నామమాత్రంగానే అసలు తగుతుంది. తక్కువ హోంలోన్ టర్మ్ పెట్టుకొంటే అందులో ఎక్కువగా అసలు తీరుతుంది. వడ్డీకి తక్కువ కట్ చేస్తారు. దీంతో ప్రిన్సిపల్ రుణం తగ్గుతుంది. ఇది లోన్ తీసుకున్నవారికి ఒకరకంగా ఉపశమనమే. తక్కువ టర్మ్ ఉంటేనే ఉపయోగమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇందుకు లోన్ తీసుకున్నవారి ఆర్ధిక స్థోమత కూడా సహకరించాలి.