Green Bond: సావరీన్‌ గ్రీన్‌ బాండ్లు అంటే ఏమిటీ.. ఎంత వడ్డీ చెల్లిస్తారు..?

Green Bond: సావరీన్‌ గ్రీన్‌ బాండ్లు అంటే ఏమిటీ.. ఎంత వడ్డీ చెల్లిస్తారు..?

Update: 2022-02-04 09:30 GMT

Green Bond: సావరీన్‌ గ్రీన్‌ బాండ్లు అంటే ఏమిటీ.. ఎంత వడ్డీ చెల్లిస్తారు..?

Green Bond: ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సావరీన్‌ గ్రీన్‌ బాండ్ల గురించి ఒక ప్రకటన చేసింది. ప్రభుత్వం గ్రీన్‌ బాండ్లని జారీ చేస్తుందని తెలిపింది. అసలు ఈ గ్రీన్‌ బాండ్లు అంటే ఏమిటీ.. వీటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి తెలుసుకుందాం. గ్రీన్ బాండ్స్ అంటే ఇతర బాండ్లలాగే పెట్టుబడిదారుల నుంచి నిధులను సమకూర్చడమే లక్ష్యం. గ్రీన్ బాండ్లకు ఇతర బాండ్లకు తేడా ఏంటంటే గ్రీన్ బ్యాండ్ లు గ్రీన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి జారీచేస్తారు.

గ్రీన్‌ బాండ్లని జారీ చేసేవారు ఈ బాండ్ల ద్వారా మీరు గ్రీన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టవచ్చని ముందే ప్రకటిస్తారు. ఇదే సాధారణ బాండ్లకి గ్రీన్‌ బాండ్లకి ఉన్న తేడా. ఎక్కువగా పర్యావరణాన్ని రక్షించేందుకు ఈ బాండ్లను జారీచేస్తారు. సంప్రదాయేతర ఇంధన వనరులు, తక్కువ కార్బన్ వినియోగించే రవాణా ప్రాజెక్టులను చేపడతారు. అయితే గ్రీన్ బాండ్లకు ఇప్పుడు ప్రామాణిక నిర్వచనం లేదు. గ్రీన్ బాండ్ల ను మార్కెట్ ఆచరణ కు అనుగుణంగా వాడుతున్నారు.

గ్రీన్ బాండ్స్ జారీవల్ల కంపెనీపై విశ్వాసం పెరుగుతుంది. గ్రీన్ ప్రాజెక్టుల ప్రదర్శనకు అవకాశం ఏర్పడుతుంది. సమగ్రంగా పర్యావరణం కాపాడేందుకు జారీచేసేవారి నిబద్ధతను, అభివృద్ధికి అవసరమయిన విధానాలను ఆవిష్కరించేందుకు దోహదపడుతుంది. గ్రీన్‌ బాండ్లు జారీ చేసేవారికి మంచి పబ్లిసిటీ దొరుకుతుంది. ప్రభుత్వాలు ఖచ్చితంగా బాండ్లను జారీ చేయడం ద్వారా డబ్బును సేకరిస్తుంది. ప్రభుత్వ బాండ్ల రాబడులు కార్పొరేట్ బాండ్‌లకు బెంచ్‌మార్క్‌గా పనిచేస్తాయి. గ్రీన్ బాండ్‌ల కోసం ఈల్డ్‌లు క్లియర్ అయిన తర్వాత అదే వ్యవధి గల బాండ్‌లను జారీ చేయడానికి కార్పొరేట్‌లకు సహాయపడుతాయి.

Tags:    

Similar News