Post Office Monthly Income Scheme: ఎలాంటి రిస్క్ లేకుండా నెలనెలా ఆదాయం కావాలా? అయితే ఈ స్కీముల గురించి తెలుసుకోవాల్సిందే..!!
Post Office Monthly Income Scheme: నేటి కాలంలో సంపాదన ఎంత ముఖ్యమో..పొదుపు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో మనం ఊహించలేము.
Post Office Monthly Income Scheme: ఎలాంటి రిస్క్ లేకుండా నెలనెలా ఆదాయం కావాలా? అయితే ఈ స్కీముల గురించి తెలుసుకోవాల్సిందే..!!
Post Office Monthly Income Scheme: నేటి కాలంలో సంపాదన ఎంత ముఖ్యమో..పొదుపు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో మనం ఊహించలేము. అందుకే చాలా మంది తమకు వచ్చిన జీతంలో ఎంతోకొంత పెట్టుబడి పెట్టుడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు రిస్క్ చేసి మరీ అధిక ఆదాయంవచ్చే పెట్టుబడులను ఆశ్రయిస్తారు. మరికొందరు మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయాన్ని ఆశిస్తుంటారు. మీరు కూడా ఆవిధంగానే రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టి డబ్బులు పొందాలనుకుంటున్నారా. అయితే మీకోసం ఓ స్కీమును తీసుకువచ్చాము. అదే పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్. ఇందులో పెట్టుబడికి భద్రత, స్థిరమైన నెలలవారీ ఆదాయం పొందాలనుకునేవారికి మంచి పథకమని చెప్పవచ్చు. మరీముఖ్యంగా సీనియర్ సీటిజన్లు, రిటైర్మెంట్ తర్వాత నెలలవారీ ఖర్చుల కోసం కచ్చితమైన ఆదాయం పొందాలనుకుంటే ఈ స్కీమ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్కీము గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
- సురక్షిత పెట్టుబడి పెట్టాలనుకువారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ మంచి ఆప్షన్. ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 5ఏళ్లు. ఈ స్కీములో చేరిన వారు ఒకసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నెలనెలా ఇన్వెస్ట్ చేయడానికి ఇందులో ఛాన్స్ ఉండదు. 5ఏళ్లకు సరిపడా ఒకేసారి పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు నెలలవారీ ఆదాయం పొందవచ్చు.
-ఈ స్కీములో అకౌంట్ ను ఎవరైనా సరే వ్యక్తిగతంగా, జాయింటుగా తీసుకోవచ్చు. 10ఏళ్లు నిండిన పిల్లల పేరుపై గార్డియన్ అకౌంట్ తీసుకోవచ్చు.
-ఈ స్కీములో కనీసం పెట్టుబడి రూ. 1000 ఉంటుంది. సింగిల్ అకౌంట్లో గరిష్టంగా రూ. 9లక్షలు, ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్టంగా రూ. 15లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు.
- ప్రస్తుతం ఈ స్కీముపై 7.4శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుంటాయి. మీరు పెట్టుబడి పెట్టే మొత్తాన్ని బట్టి మీకు నెలనెలా వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుందనే విషయాన్ని గుర్తించుకోవాలి.
-ఎంఐఎస్ అకౌంట్ తీసుకున్న ఐదేళ్లకు మెచ్యూరిటీ పూర్తి అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత పెట్టుబడిని మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. అనుకోని కారణాల వల్ల ఖాతాదారులు స్కీమ్ ను మూసివేయాలనుకుంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
మీరు జాయింట్ అకౌంట్ తీసి అందులో 15లక్షలు పెట్టుబడి పెడితే ప్రస్తుతం ఉన్న వడ్డీ ప్రకారం ప్రతినెలా మీ అకౌంట్లో రూ. 9, 250 డిపాజిట్ అవుతుంది. అదే సింగిల్ అకౌంట్ తెరిచి గరిస్టంగా రూ. 9లక్షలు పెట్టుబడి పెడితే మీకు ప్రతినెలా రూ. 5,550 వడ్డీ వస్తుంది. ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ల వంటి వివరాలు పోస్టాఫీసులో తెలుసుకోండి.