New UPI Rules: యుపీఐ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన NPCI
New UPI Rules: యూపీఐను ఉపయోగించే వారికి శుభవార్త.
New UPI Rules: యుపీఐ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన NPCI
New UPI Rules: యూపీఐను ఉపయోగించే వారికి శుభవార్త. యూపీఐ ద్వారా డబ్బు పంపిన తర్వాత, డబ్బులు డెబిట్ అయిన తర్వాత, ఒకవేళ ఆ ట్రాన్స్ యాక్షన్ ఫెయిల్‌తే, మళ్లీ డబ్బులు మన అకౌంట్‌లో పడడానికి ఇప్పటివరకు కొన్ని రోజుల పాటు ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పటి నుంచి ఆ డబ్బు వెంటనే ఖాతాలో పడిపోతుంది. ఇదే కాదు ఇలాంటివెన్నో కొత్త రూల్స్ ఇప్పుడు NPCI తీసుకొచ్చింది.
NPCI(national payments corporation of india) యుపీఐ వినియోగదారులకు జూలై 15 నుండి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం, యుపీఐ ద్వారా డబ్బు పంపిన తర్వాత, అకౌంట్‌లో డబ్బులు డెబిట్ అయిన తర్వాత, ట్రాన్స్ యాక్షన్ ఫెయిల్ అయితే ఆ డబ్బు వెంటనే ఇప్పుడు వినియోగదారుల అకౌంట్‌లోకి తిరిగి వస్తుంది. ఇదేకాదు, తప్పు యుపిఐకు డబ్బు పంపినా కూడా వినియోగదారుడు రిసీవర్ బ్యాంకు నుండి డబ్బును తిరిగి పొందవచ్చు.
ఈ కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు ఇప్పుడు NPCI నుండి ముందస్తు అనుమతి అవసరం లేకుండానే డెబిట్ అయిన డబ్బులను మళ్లీ వెంటనే తిరిగి వినియోగదారుడు అకౌంట్‌లోకి వేయగలవు. అదేవిధంగా తిరస్కరించబడిన పాత కేసులను తిరిగి దర్యాప్తు చేసి, వాటిని పరిష్కరించే అధికారం కూడా ఇప్పుడు బ్యాంకులకు ఉంది.
చెల్లింపు సమయం, లావాదేవీలు
అంతకుముందు యుపీఐ ద్వారా చెల్లింపులు 30 సెకన్లలో ప్రాసెస్ చేస్తే ఇప్పుడు అవి 10–15 సెకన్లలోపు పూర్తి అవుతుంది. అదేవిధంగా లావాదేవీల స్థితిని తనిఖీ చేయడానికి లేదా విఫలమైన లావాదేవీలను రివర్స్ చేయడానికి పట్టేసమయంలోనూ మార్పులు వచ్చాయి. గతంలో వినియోగదారుడు డబ్బును పంపిన తర్వాత అది కట్ అయిందా? లేదా తిరిగి మళ్లీ వచ్చేసిందా? అనేది తెలుసుకోడానికి 30 సెకన్ల సమయం పట్టేది. కానీ ఇప్పుడు అది 10 సెకన్లలో తెలిసిపోతుంది.