IPO : తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందాలనుకుంటున్నారా? వచ్చే వారం రానున్న 5 IPOలు ఇవే!
IPO: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. వచ్చే వారం ఐదు కొత్త కంపెనీలు తమ IPO (Initial Public Offering) ద్వారా డబ్బులు సమీకరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
IPO: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. వచ్చే వారం ఐదు కొత్త కంపెనీలు తమ IPO (Initial Public Offering) ద్వారా డబ్బులు సమీకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే, ఇన్వెస్టర్లు కంపెనీల్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు పొందవచ్చు. మరి ఆ ఐదు కంపెనీలు ఏమిటో తెలుసకుందాం.
వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లో సందడి నెలకొననుంది. ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు ఏకంగా 5 IPOలు సిద్ధంగా ఉన్నాయి. బోరానా వీవ్స్, విక్టరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, డార్ క్రెడిట్, బెల్‌రైజ్ ఇండస్ట్రీస్, యూనిఫైడ్ డేటా-టెక్ కంపెనీలు IPOతో రానున్నాయి. మరోవైపు, 3 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాబోతున్నాయి. గత కొన్ని వారాలుగా IPOల సందడి కాస్త తగ్గినా, మళ్లీ మార్కెట్ ఊపందుకోవడంతో IPOల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఐదు IPOల వివరాలు ఇప్పుడు చూద్దాం
వచ్చే వారం రానున్న 5 IPOలు:
1. బోరానా వీవ్స్ (Borana Weaves): ఈ IPO మే 20, 2025న ప్రారంభమై మే 22, 2025న ముగుస్తుంది. కంపెనీ రూ.144.89 కోట్లు సమీకరించనుంది. ఇది రూ.10 ముఖ విలువతో పూర్తిగా కొత్త షేర్ల జారీ చేస్తుంది. బోరానా వీవ్స్ లిమిటెడ్ వస్త్ర తయారీలో పేరుగాంచిన సంస్థ. ఫైబర్ నుంచి ఫ్యాబ్రిక్ వరకు అన్ని ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
2. విక్టరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ (Victory Electric Vehicles): ఈ IPO మే 20, 2025న ప్రారంభమై మే 23, 2025న ముగుస్తుంది. దాదాపు రూ.40.66 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ IPO పూర్తిగా కొత్త షేర్ల జారీ చేస్తుంది. విక్టరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ వాహనాల డిజైన్, ఉత్పత్తి, పంపిణీలో నిమగ్నమై ఉంది.
3. డార్ క్రెడిట్ (Dar Credit): ఈ IPO మే 21, 2025న ప్రారంభమై మే 23, 2025న ముగుస్తుంది. దీని ద్వారా రూ.25.66 కోట్లు సమీకరించనున్నారు. ఇది పూర్తిగా కొత్త షేర్ల జారీ, ఒక్కో షేరు ముఖ విలువ రూ.10. డార్ క్రెడిట్ అండ్ క్యాపిటల్ వ్యక్తిగత రుణాలు, హామీ లేని చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలు (MSME) అందిస్తుంది.
4. బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ (Belrise Industries): ఈ IPO మే 21, 2025న ప్రారంభమై మే 23, 2025న ముగుస్తుంది. దాదాపు రూ.2,150 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తిగా కొత్త షేర్ల జారీ, ఒక్కో షేరు ముఖ విలువ రూ.5. 1996లో స్థాపించబడిన బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ తయారీలో పేరుగాంచింది. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ప్రయాణీకుల, వాణిజ్య నాలుగు చక్రాల వాహనాల కోసం సేఫ్టీ పరంగా ముఖ్యమైన ఇంజనీరింగ్ పరిష్కారాలను అందిస్తుంది.
5. యూనిఫైడ్ డేటా-టెక్ (Unified Data-Tech): ఈ IPO మే 22, 2025న ప్రారంభమై మే 26, 2025న ముగుస్తుంది. ఒక్కో షేరు ధర రూ.260 నుండి రూ.273 వరకు ఉంటుంది. ఈ IPO ద్వారా రూ.144.47 కోట్లు సమీకరించనున్నారు. ఇందులో రూ.10 ముఖ విలువ కలిగిన 52,92,000 షేర్లు OFS (Offer for Sale) ద్వారా విక్రయించబడతాయి.
ఈ కంపెనీలు లిస్ట్ కానున్నాయి:
* వర్చువల్ గెలాక్సీ ఇన్‌ఫోటెక్ (Virtual Galaxy Infotech): ఈ IPO మే 9న ప్రారంభమై మే 14, 2025న ముగిసింది. షేర్ల కేటాయింపు మే 15న జరిగింది. ఈ కంపెనీ షేర్లు మే 19న లిస్ట్ అవుతాయి.
* ఇంటిగ్రిటీ ఇన్‌ఫ్రాబిల్డ్ డెవలపర్స్ (Integrity InfraBuild Developers): ఈ IPO మే 13న ప్రారంభమై మే 15న ముగిసింది. షేర్ల కేటాయింపు మే 16న జరిగింది. ఈ కంపెనీ షేర్లు మే 20న లిస్ట్ అవుతాయి.
* ఎక్రిషన్ ఫార్మాస్యూటికల్స్ (Accretion Pharmaceuticals): ఈ IPO మే 14న ప్రారంభమై మే 16న ముగిసింది. షేర్ల కేటాయింపు మే 19న ఖరారు చేయబడుతుంది. ఈ కంపెనీ షేర్లు మే 21న లిస్ట్ అవుతాయి.