Diesel Vehicles: భవిష్యత్‌లో డీజిల్ వాహనాలు కనిపించవా.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..!
Auto News: 2070 నాటికి కార్బన్ నెట్ జీరోను సాధించడం, డీజిల్ వంటి ప్రమాదకర ఇంధనాల వల్ల కలిగే వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడం, అలాగే ఆటోమొబైల్ అమ్మకాలలో వేగంగా వృద్ధి చెందడం వంటి మా కట్టుబాట్లకు అనుగుణంగా, మేం క్లీన్ అండ్ గ్రీన్‌ను అనుసరించడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.
Diesel Vehicles: భవిష్యత్‌లో డీజిల్ వాహనాలు కనిపించవా.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..!
Diesel Vehicle Extra Tax: డీజిల్ వాహనాలపై 10% అదనపు పన్ను విధించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదంటూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. వాస్తవానికి, డీజిల్‌తో నడిచే వాహనాలు, జనరేటర్‌లను విపరీతంగా ఉపయోగించడం కొనసాగిస్తే, ప్రతిదానిపై 'కాలుష్య పన్ను' విధించబడుతుందని కేంద్ర మంత్రి మంగళవారం భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) 63వ వార్షిక సదస్సులో చెప్పుకొచ్చారు. డీజిల్ ఇంజిన్.. 10% అదనపు పన్ను పెంచేందుకు ఆర్థిక మంత్రితో మాట్లాడతాను. దీని తర్వాత డీజిల్ వాహనాలపై 10% జీఎస్టీ విధిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్రకటనపై నితిన్ గడ్కరీ వివరణ..
కేంద్ర మంత్రి గడ్కరీ తన పోస్ట్‌లో, 'మీడియా నివేదికలలో, డీజిల్ వాహనాలపై అదనంగా 10% జీఎస్‌టీ విధిస్తామని చెబుతున్నారు. దీనిపై మేం ప్రస్తుతం లేమని స్పష్టం చేయాలనుకుంటున్నాం. ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన. పరిశీలనలో లేదంటూ' తెలిపారు.
2070 నాటికి కార్బన్ నెట్ జీరోను సాధించడం, డీజిల్ వంటి ప్రమాదకర ఇంధనాల వల్ల కలిగే వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడం, అలాగే ఆటోమొబైల్ అమ్మకాలలో వేగంగా వృద్ధి చెందడం వంటి మా కట్టుబాట్లకు అనుగుణంగా, మేం క్లీన్ అండ్ గ్రీన్‌ను అనుసరించడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనం, ఈ ఇంధనాలు దిగుమతి ప్రత్యామ్నాయాలు, తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, దేశీయమైనవి, కాలుష్య రహితంగా ఉండాలంటూ తెలిపారు.
హరిత ఇంధనం వైపు వెళ్లాలని ఆటో పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తూ, గ్రీన్ ఎనర్జీలో మార్పు తీసుకురావాలంటే ఇదొక్కటే మార్గమని, లేకుంటే ప్రజలు వినే మూడ్‌లో లేరని అన్నారు. డీజిల్ వాహనాల ఉత్పత్తిని తగ్గించాలని ఆటో పరిశ్రమను గడ్కరీ కోరారు.
పరిశ్రమలు పెట్రోల్, డీజిల్ నుంచి గ్రీన్ ఇంధనం వైపు మళ్లాలని విజ్ఞప్తి చేశారు. అలా చేయడంలో విఫలమైతే, ప్రభుత్వం 'అదనపు పన్నులు' జోడిస్తుంది.
ఆటో కంపెనీల షేర్లు 4% క్షీణించాయి. కేంద్ర మంత్రి ప్రకటన తర్వాత, భారతీయ ఆటోమేకర్ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్ షేర్లు 2.5% నుంచి 4% మధ్య పడిపోయాయి.
డీజిల్ వాహనాల అమ్మకాలపై ప్రభావం..
డీజిల్ వాహనాలపై 10% అదనపు పరోక్ష పన్ను విధిస్తే.. కార్ల తయారీ కంపెనీలు వాహనాల ధరలను పెంచాల్సి ఉంటుంది. ఇది వారి అమ్మకాలపై కూడా ప్రభావం చూపుతుంది. దేశంలోని దాదాపు అన్ని వాణిజ్య వాహనాలు డీజిల్ ఇంజన్లతో నడుస్తున్నాయి.