Aadhaar Alert: ఆధార్‌ కార్డు అలర్ట్‌.. వారిపై కఠిన చర్యలు..!

Aadhaar Alert: ఆధార్‌ కార్డు అలర్ట్‌.. వారిపై కఠిన చర్యలు..!

Update: 2022-12-07 09:29 GMT

Aadhaar Alert: ఆధార్‌ కార్డు అలర్ట్‌.. వారిపై కఠిన చర్యలు..!

Aadhaar Alert: ఆధార్ కార్డ్ హోల్డర్లు ఈ విషయాన్ని గమనించాలి. ప్రభుత్వం కొన్ని కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని పాటించకపోతే పెద్ద నష్టాన్ని భరించవలసి ఉంటుంది. అలాగే ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఏదైనా ఏజెన్సీ అదనంగా వసూలు చేస్తే దానిపై కఠిన చర్యలు తీసుకుంటామని UIDAI ట్వీట్ చేసింది. అంతేకాకుండా 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఆధార్ ఒక ముఖ్యమైన పత్రమని దీనిని అన్ని ముఖ్యమైన పత్రాలతో లింక్ చేసి ఉంచాలని, తద్వారా ఎలాంటి సమస్య ఉండదని యూఐడీఏఐ ట్వీట్ చేసింది.

ఆదాయపు పన్ను శాఖ గురించి కూడా ట్వీట్ చేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం పాన్ హోల్డర్లందరు ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ 31.3.2023 అని పేర్కొంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ పనిచేయకుండా పోతుంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసే తేదీ ఇప్పటికే చాలాసార్లు పొడిగించారు. ఈసారి ప్రభుత్వం పొడిగించడానికి సిద్దంగా లేదు. కాబట్టి వీలైనంత త్వరగా ఆధార్, పాన్‌లను లింక్ చేయండి. దీనికి సంబంధించి సీబీడీటీ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది.

10,000 జరిమానా

మార్చి 31, 2023 వరకు మీరు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. ఈ రెండు పత్రాలను లింక్ చేయని వ్యక్తుల పాన్ పనికిరానిదిగా మారుతుంది. తరువాత పాన్ కార్డ్ హోల్డర్లు బ్యాంకులో ఖాతా తెరవడం నుంచి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయలేరు. ఇది కాకుండా మీరు ఎక్కడైనా చెల్లని పాన్ కార్డ్‌ని ఉపయోగిస్తే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 272B కింద రూ.10,000 వరకు జరిమానా విధిస్తారు.

Tags:    

Similar News