Rajiv Yuva Vikasam: యువతకు భారీ గుడ్ న్యూస్.. లక్ష మందికి.. లక్ష రూపాయల సాయం..పూర్తి వివరాలివే..!!
Rajiv Yuva Vikasam: యువతకు భారీ గుడ్ న్యూస్.. లక్ష మందికి.. లక్ష రూపాయల సాయం..పూర్తి వివరాలివే..!!
Rajiv Yuva Vikasam: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకం చేపట్టిన రాజీవ్ యువ వికాసం స్కీమ్ జూన్ 2న షురూ కానుంది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో పలు యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొదటి విడతగా లక్షమందికి యూనిట్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు.
మొత్తం నాలుగు కేటగిరీల్లో మొదటి విడతగా రూ. 50వేలు, రూ 1 లక్ష లోపు విలువ గల యూనిట్లకు చెందిన రెండు కేటగిరీలకు మాత్రమే మంజూరు పత్రాలు ఇస్తున్నారు. ఈ రెండింటిని కలిపి లక్ష మందికి యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 14 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించగా..మొత్తం 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని నాలుగు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1: రూ.50 వేలు లోపు, కేటగిరీ 2: రూ.50 వేలు – రూ.1 లక్ష మధ్య, కేటగిరీ 3: రూ.1 లక్ష – రూ.2 లక్షల మధ్య, కేటగిరీ 4: రూ.2 లక్షలు – రూ.4 లక్షల మధ్య ఉంటుంది.
ప్రస్తుతం కేటగిరీ 1,2 ల దరఖాస్తులే పరిశీలించి, ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ రెండు కేటగిరీల్లో అంచనా ప్రకారం 2.81 లక్షల మందిని ఎంపిక చేయాలనుకున్ాన..వచ్చిన దరఖాస్తులు కేవలం 1.32లక్షలు మాత్రమే. దరఖాస్తుల పరిశీలన మండల, మున్సిపల్ స్థాయిలో కమిటీల ద్వారా పూర్తయ్యింది. ఈ జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపించి వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు తుది ఎంపిక జరిపాయి. జిల్లా ఇంచార్జీ మంత్రుల ఆమోదంతో జాబితాను ఖరారు చేశారు. ఈ యూనిట్లకు ఎంత సబ్సిడీ ఇస్తుందంటే?..రూ.50 వేలు లోపు యూనిట్లకు 100% సబ్సిడీ, రూ.1 లక్ష వరకు విలువ కలిగిన యూనిట్లకు 80% సబ్సిడీ, కేటగిరీ 2ల లబ్ధిదారులు మంజూరు పత్రం తీసుకున్న తరువాత బ్యాంక్ అంగీకార పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
జూన్ 2న సాయంత్రం 4 గంటల నుంచి పత్రాల పంపిణీ ప్రారంభం అవుతుంది. ఇది జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ వచ్చే జూన్ 10 నుంచి 15 తేదీల మధ్య శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. శిక్షణ తర్వాత జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాలు నిర్వహించేలా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి అందరూ తమ యూనిట్లు ప్రారంభించేలా టార్గెట్ పెట్టుకున్నారు. అన్ని జిల్లాల్లో ఇంచార్జీ మంత్రులు, కలెక్టర్లు, సంక్షేమ శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని సర్కార్ సూచించింది. ప్రస్తుతం మంజూరు పత్రాలు కేవలం కేటగిరీ1, 2వరకు మాత్రమే పరిమితమయ్యాయి. కేటగిరీ 3, 4ల దరఖాస్తుల పరిశీలన ఇంకా ప్రారంభం అవ్వలేదు. వీరికి విడతల వారీగా పత్రాలు జారీ చేయనున్నారు.