ఉద్యోగం మార్చడానికి ట్రై చేస్తున్నారా.. ఈ సర్టిఫికెట్‌ అస్సలు మరిచిపోవద్దు..!

EPS Certificate: ప్రతి సంవత్సరం ఉద్యోగులు మంచి జీతం కోసం చాలా ఉద్యోగాలని మారుస్తుంటారు.

Update: 2023-01-02 09:30 GMT

ఉద్యోగం మార్చడానికి ట్రై చేస్తున్నారా.. ఈ సర్టిఫికెట్‌ అస్సలు మరిచిపోవద్దు..!

EPS Certificate: ప్రతి సంవత్సరం ఉద్యోగులు మంచి జీతం కోసం చాలా ఉద్యోగాలని మారుస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) మొత్తాన్ని బదిలీ చేయడంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నుంచి ఈ పీఎస్‌ (EPS) సర్టిఫికేట్ కూడా పొందాలి. కానీ ఇది చాలామంది ఉద్యోగులకు తెలియదు. ఇది తర్వాత చాలా అవసరం అవుతుంది.

అయితే చాలామంది ఉద్యోగులు దీనిని ఖచ్చితంగా పాటించడం లేదు. ఉద్యోగులు ఈపీఎస్‌ స్కీమ్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. దీనివల్ల ఎంత సర్వీసు కాలానికి పింఛన్‌ లభిస్తుందో తెలుస్తుంది. ఉదాహరణకి ఒక ఉద్యోగి పలు ఉద్యోగాలు మార్చుకున్నారనుకుందాం. అతని కొత్త యజమాని EPF స్కీమ్ కింద రిజిస్టర్ కాలేదు. ఈ పరిస్థితిలో పాత EPF ఖాతాకు సంబంధించిన పెన్షన్ స్కీమ్ సర్టిఫికేట్ సహాయం చేస్తుంది. ఇది మీ పెన్షన్ క్లెయిమ్‌లో రుజువుగా ఉపయోగపడుతుంది.

EPS సర్టిఫికెట్ ఇలా పొందండి..

EPS పథకాన్ని పొందే ప్రక్రియ చాలా సులభం. ఆన్‌లైన్‌లో చేయవచ్చు. మెంబర్ సర్వీస్ పోర్టల్‌ని సందర్శించడం వల్ల EPF సభ్యుడు EPS స్కీమ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

1. ముందుగా UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్), పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ కావాలి.

2. తర్వాత మెను ట్యాబ్‌లోని ఆన్‌లైన్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి. క్లెయిమ్ (ఫారం - 31, 19, 10C)ని ఎంచుకోవాలి.

3. తర్వాత EPFO రికార్డ్‌లో నమోదు అయిన బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఎంటర్‌ చేసి, వెరిఫైపై క్లిక్ చేయాలి. సర్టిఫికేట్ లేదా అండర్‌టేకింగ్ ఎంపికపై క్లిక్ చేసి అవునుపై నొక్కాలి.

4. "నేను దరఖాస్తు చేయాలనుకుంటున్నాను" అనే విభాగాన్ని ఎంచుకుని "ఓన్లీ పెన్షన్ విత్‌ డ్రా (ఫారం 10C)"పై క్లిక్ చేయాలి.

5. EPFO రికార్డుల ప్రకారం మీ పూర్తి ఇంటి చిరునామాను ఎంటర్‌ చేయాలి. ఆధార్ OTPని ఎంచుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

6. OTPని ఎంటర్‌ చేసి ధృవీకరించుపై క్లిక్ చేయాలి. చివరగా సమర్పించు ఫారమ్‌పై క్లిక్ చేస్తే EPS స్కీమ్ సర్టిఫికేట్ ప్రక్రియ పూర్తవుతుంది.

Tags:    

Similar News