Stock Market: ట్రంప్ పట్టాభిషేకం.. ఈరోజు స్టాక్ మార్కెట్ మళ్లీ పెరుగుతుందా?
అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలిచినప్పుడు భారత స్టాక్ మార్కెట్ రాకెట్ లా దూసుకెళ్లింది. అన్ని కంపెనీల షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది.
Stock Market: అమెరికా ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ గెలిచినప్పుడు భారత స్టాక్ మార్కెట్ రాకెట్ లా దూసుకెళ్లింది. అన్ని కంపెనీల షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపడుతున్నారు.భారత స్టాక్ మార్కెట్ మరోసారి ఆటుపోట్లలో పడింది. రెండు రోజుల సెలవుల తర్వాత స్టాక్ మార్కెట్లు జనవరి 20న తెరుచుకుంటాయి. భారత మార్కెట్లపై ట్రంప్ ఎలాంటి ప్రభావం చూపుతుందని చాలా మంది ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. పట్టాభిషేకంపై స్టాక్ మార్కెట్ మళ్ళీ రికార్డు సృష్టిస్తుందా నిపుణుల అభిప్రాయం ఏంటో చూద్దాం.
స్టాక్ మార్కెట్ పై ట్రంప్ ప్రభావం
జనవరి 20 సోమవారం సాయంత్రం డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నవంబర్ 6న ట్రంప్ అమెరికా ఎన్నికల్లో గెలిచినప్పుడు సెన్సెక్స్ 901.50 పాయింట్లు పెరిగి 80,378.13 స్థాయిని దాటగా, నిఫ్టీ 270 పాయింట్లకు పైగా పెరుగుదలను చూసింది. ట్రంప్ పట్టాభిషేకం భారత మార్కెట్లకు పెద్ద మార్పుగా నిరూపించబడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పెట్టుబడిదారులు జాగ్రత్తగా, తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది.
స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి డోనాల్డ్ ట్రంప్‌పై ఉంది. ట్రంప్ జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా అధికారికంగా వైట్‌హౌస్‌కు తిరిగి వస్తున్నారు . దీని తరువాత ఆయన చేసిన ప్రకటనల ప్రభావం మార్కెట్‌పై కనిపిస్తుంది. ట్రంప్ పట్టాభిషేకం భారత స్టాక్ మార్కెట్లపై సానుకూల , ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ పరిశోధన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. అతని అమెరికా ఫస్ట్ విధానం వ్యాపారానికి సమస్యలను సృష్టించగలదు. కానీ అదే సమయంలో, అమెరికా-భారత్ సంబంధాల నుండి ఐటీ, ఫార్మాస్యూటికల్స్, రక్షణ రంగాలు ప్రయోజనం పొందవచ్చు. రూపాయి, డాలర్ గురించి మాట్లాడుకుంటే.. డోనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల, అమెరికా డాలర్ బలపడవచ్చు.. రూపాయి బలహీనపడవచ్చు.