Trump Coin: ట్రంప్ కాయిన్ ప్రకంపనలు..లాంచ్ అయిన కొన్ని గంటల్లోనే సంచలనం

Update: 2025-01-19 04:50 GMT

Trump Coin: క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ట్రంప్ కాయిన్ సంచలనం క్రియేట్ చేస్తోంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణా స్వీకారానికి ముందు లాంచ్ అయిన ఈ కాయిన్ కొన్నిగంటల వ్యవధిలోనే 300శాతం పెరిగి ఏకంగా 6.76 బిలియన్ డాలర్ల పీక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కు చేరింది. దీనిని ట్రంప్ కాయిన్ అని ట్రంప్ మీమ్ కాయిన్ అని పిలుస్తున్నారు. ఈ ట్రంప్ కాయిన్ మీమ్ కాయిన్ వాల్యూ అమాంతం పెరగడంతో ఇప్పడు అందరి చూపు దీని మీదే పడింది.

అసలీ ట్రంప్ మీమ్స్ అంటే ఏంటి?

ఇవి ఇతర డిజిటల్ కరెన్సీల మాదిరిగానే ట్రంప్ మీమ్ కాయిన్స్ కూడా పనిచేస్తాయి. వీటితో ట్రాన్సాక్షన్లు, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయవచ్చు. కాగా ఈ కాయిన్ శనివారం ట్రేడింగ్ కు రాగా హై 33.87 డాలర్లుగా నమోదు అయ్యింది.

ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ఈ క్రిప్టో కరెన్సీని ప్రకటించారు. తన నాయకత్వానికి స్థితిస్థాపకతకు సూచిక ఈ ట్రంప్ కాయిన్ అంటూ అభివర్ణించారు. మీమ్ కాయిన్స్ తరుచుగా ఇంటర్నెట్ ట్రెండ్స్ వ్యక్తిత్వాలతో సంబంధం ఉంటుంది. ఇవి అంతర్గాత విలువను కలిగి ఉండవు కానీ ఊహాజనిత ప్రయోజనాల కోసం వీటిలో విస్త్రుతంగా ట్రేడింగ్ జరుగుతోంది.

ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గని నాయకుడిని అని ఈ ట్రంప్ మీమ్ సెలబ్రేట్ చేస్తుందని కాయిన్ అధికారిక వెబ్ సైట్ తెలిపింది. దీనిలో 2024 జులైలో ట్రంప్ పై జరిగిన హత్యాయాత్నం గురించి కూడా ప్రస్తావించడం ఈ కాయిన్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. 

Tags:    

Similar News