Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో దూకుడు
Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యం * సెన్సెక్స్ 404 పాయింట్ల లాభంతో 52,990 వద్ద ట్రేడింగ్
Representational Image
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో దూకుడుగా కొనసాగుతున్నాయి ..అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం పదకొండు గంటల సమయానికి సెన్సెక్స్ 404 పాయింట్ల లాభంతో 52,990 వద్ద.. నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 15,877 వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్ల భారీ లాభాల ముగింపు, ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణితో పాటు దేశీయంగా కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో దేశీ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.