Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Stock Market: 109 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
Representational Image
Stock Market: భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వరుస నష్టాల నుంచి సోమవారం కోలుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు మళ్లీ నేలచూపులు చూశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు కాసేపటికే కిందకు దిగజారుతూ వెళ్లాయి. చివరి వరకు ఒడిదొడుకుల్లో కొనసాగి చివరికి నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 109 పాయింట్ల నష్టంతో 60 వేల 29 వద్ద ముగిసింది. నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 17 వేల 888 వద్ద ముగిసింది.