Stock Market Today: దేశీ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలు

Stock Market Today * అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు * తాజా సెషన్ లో దేశీ సూచీలు లాభాలతో ప్రారంభం.

Update: 2021-07-22 05:00 GMT

దేశీ ఈక్విటీ మార్కెట్లలో భారీ లాభాలు

Stock Market Today: దేశీ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో దూకుడుగా సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు తాజా సెషన్ లో లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 442, నిఫ్టీ 126 పాయింట్ల మేర లాభాల వద్ద కదలాడుతున్నాయి.

దేశంలో పెట్రోల్‌ , డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.గత ఐదు రోజులుగా పెట్రోల్ ధరలు..వారం రోజులుగా డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.రోజువారీ ధరల సమీక్షలో భాగంగా జూలై 17న పెట్రోల్ పై 31 పైసలు పెరగ్గా జూలై 15 న డీజిల్ ధరలు లీటర్ పై 18 పైసలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ 105 రూపాయల మార్క్ ఎగువకి చేరి 105 రూపాయల 83 పైసలుగా నమోదయింది. లీటరు డీజిల్‌ ధర 97 రూపాయల 96 పైసలు వద్దకి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 101.84 వద్దకు చేరగా ముంబై లో 107 రూపాయల 83 పైసలు దాటి పరుగులు పెడుతోంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపధ్యంలో పెట్రో ధరల పెంపు జోలికి వెళ్లడం లేదనే వాదనలు వినవస్తున్నాయి. ఇక మే 4వ తేదీ నుండి ఇంధన ధరలు 40 పర్యాయాలు పెరగ జులై నెలలోనే పెట్రోల్‌ ధర ఎనిమిది సార్లు పెరిగింది.

Tags:    

Similar News