Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్ ధరలు

Petrol Diesel Price Today: రూ. 98-99 వ‌ద్ద ఊగిసలాడిన పెట్రోల్ ధ‌ర ఇప్పుడు ఏకంగా కొన్ని ప్రాంతాల్లో రూ. 104కి చేరింది.

Update: 2021-06-29 01:42 GMT

Petrol Diesel Price Today:(File Image) 

Petrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించని కేంద్రం... ఇప్పుడు ధరలు పెంచడానికి మాత్రం అంతర్జాతీయ ధరలే కారణమని చెబుతోంది. వీటికి తోడు కేంద్రం, రాష్ట్రాలు వేసే పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు ఈ ధరల వలన రవాణా చార్జీలు కూడా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అసలే సంక్షోభం.. ఆ పై కోవిడ్ దెబ్బ.. వీటితో కుదేలైన సామాన్యుడు.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో తీవ్రంగా దెబ్బ తింటున్నాడు.

కాని దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలనే కారణమని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొస్తున్నారు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల.. ఒక లీటర్ పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ కొట్టి ముందుకు దూసుకెళుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వ‌ర‌కు రూ. 98-99 వ‌ద్ద ఊగిసలాడిన పెట్రోల్ ధ‌ర ఇప్పుడు ఏకంగా కొన్ని ప్రాంతాల్లో రూ. 104కి చేరింది. మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్రదేశ్‌లో దాదాపు అన్ని ప‌ట్ట‌ణాల్లో ఈ మార్కును దాటేసింది. అయితే మంగ‌ళ‌వారం పెద్ద‌గా పెట్రోల్ ధ‌ర‌ల్లో మార్పులు లేక‌పోయిన‌ప్ప‌టికీ రూ. వంద దాటిన లీట‌ర్ పెట్రోల్‌ను చూస్తుంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 98.46 గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ. 88.90 వ‌ద్ద కొన‌సాగుతోంది. ముంబయిలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 104.56 వ‌ద్ద ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ. 96.42 గా న‌మోదైంది. చెన్నైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 99.49 గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ. 93.46 వ‌ద్ద కొన‌సాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో …

హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 102.32 గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ. 96.90 వ‌ద్ద కొన‌సాగుతోంది. వ‌రంగ‌ల్ లో పెట్రోల్ రూ. 102.20 కాగా, డీజిల్ ధ‌ర రూ. 96.77 గా ఉంది.

విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 104.61 గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ. 98.58 గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 103.41 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, డీజిల్ ధ‌ర రూ. 97.41 గా న‌మోదైంది. అనంత‌పురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, క‌ర్నూలు, నెల్లూరు, ప్ర‌కాశం… ఇలా చెప్పుకుంటే దాదాపు అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 104 దాటింది.

Tags:    

Similar News