Petrol, Diesel Price Today: దేశంలో నిలకడగా పెట్రో ధరలు
Petrol, Diesel Price Today: దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Representational Image
Petrol, Diesel Price Today: దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.గత తొమ్మిది రోజులుగా పెట్రోల్ ధరలు పదకొండు రోజులుగా డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.రోజువారీ ధరల సమీక్షలో భాగంగా జూలై 17న పెట్రోల్ పై 31 పైసలు పెరగ్గా జూలై 15 న డీజిల్ ధరలు లీటర్ పై 18 పైసలు చొప్పున పెరిగాయి ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 105 రూపాయల మార్క్ ఎగువకి చేరి 105 రూపాయల 83 పైసలుగా నమోదయింది. లీటరు డీజిల్ ధర 97 రూపాయల 96 పైసలు వద్దకి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 101.84 వద్దకు చేరగా ముంబై లో 107 రూపాయల 83 పైసలు దాటి పరుగులు పెడుతోంది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపధ్యంలో పెట్రో ధరల పెంపు జోలికి వెళ్లడం లేదనే వాదనలు వినవస్తున్నాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్ ధరలు 39 సార్లు పెరగ్గా..అదే సమయంలో డీజిల్ రేట్లు 36 సార్లు పెరిగాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రో రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.