Petrol and Diesel Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
*ఏమాత్రం వెనుకాడని చమురు సంస్థలు *లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంపు
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు(ఫైల్ ఫోటో)
Petrol and Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వాహనదారుల జేబులను కొల్లగొడుతూనే ఉన్నాయి చమురు సంస్థలు. ఇవాళ కూడా వాటి రేట్లు పెరిగాయి. ఇంధన ధరలను పెంచే విషయంలో చమురు సంస్థలు ఏ మాత్రం వెనుకాడట్లేదు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 110.82, డీజిల్ ధర 103.94 రూపాయలకు చేరింది.
గుంటూరులో లీటర్ పెట్రోల్ 112.73 రూపాయలు, డీజిల్ 104.55 రూపాయలకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 106.54, డీజిల్ రేటు 95.27 రూపాయలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ 112.44 రూపాయలు చేరగా డీజిల్ 103.26కి చేరింది. మనదేశంలో పెట్రోల్ రేటు అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ రేటు 117.98 రూపాయలుగా ఉంది. డీజిల్ ధర 108.85 రూపాయలకు చేరింది.