Petrol and Diesel Price Today: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
* పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 35పైసల చొప్పున పెంపు * హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.72
వరుసగా ఐదోరోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు(ఫైల్ ఫోటో)
Petrol and Diesel Price Today: వరుసగా ఐదోరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ప్రధాన నగరాల్లో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ రెండింటిపై లీటరుకు 35 పైసల చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 109 రూపాయల 34పైసలకి చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయల 72పైసలకు చేరింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆగడం లేదు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బండి బయటకు తీయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పైగా ఇంధన ధరలు పెరగడంతో రవాణా, సరఫరా ఖర్చులు పెరిగి ఇతర నిత్యావసర వస్తువుల ధరలపైనా ఆప్రభావం పడుతోంది.