Petrol and Diesel Prices Today: దేశంలో మరోమారు పెరిగిన పెట్రో ధరలు .
Petrol Rate: ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన పెట్రోల్ ,డీజిల్ ధరలు
Representational Image
Petrol and Diesel Prices Today: దేశంలో పెట్రో ధరలు వరుసగా రెండో రోజు మళ్లీ పెరిగాయి. దేశంలోని మెట్రో నగరాల్లో వారం తొలిరోజున స్థిరంగా వున్న పెట్రో ధరలు రెండ్రోజులుగా పెరుగుతూనే వున్నాయి. చాలా సిటీల్లో ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకగా..తాజాగా పెట్రోల్ ధర 15 పైసలు ..డీజిల్ ధర 15 పైసలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 97.27 వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 92.07 వద్దకు చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 93 రూపాయల 44 పైసలుగా వుండగా డీజిల్ ధర 84 రూపాయల 32 పైసలు వద్దకి చేరింది. ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ముడి చమురు ధరలు పరుగులు తీస్తున్నాయి.