Gold Rate: నేల చూపులు చూస్తోన్న బంగారం, వెండి ధరలు

Gold Rate: వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి

Update: 2021-04-27 02:24 GMT

Today Gold, Silver Rates:(File Image)

Gold Rate: గత కొన్నిరోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలకు గత రెండు రోజులుగా బ్రేక్ పడింది. దీంతో ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్న రేట్లు వరుసగా నెలవైపు చూస్తున్నాయి. ఇక సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ అంటే మంగళవారం ఉదయం ఎలాంటి మార్పులు చోటు చేసుకోకుండా.. స్థిరంగా కోనసాగుతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,940 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,940గా ఉంది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాన నగరాల్లో ఇలా...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ. 46,240 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,460గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,940 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,940గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,700గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,770గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.44,590 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,650గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,590గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,650గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు...

బంగారం బాటలోనే వెండి ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధరలు మరోసారి నెలచూపులు చూస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్న వెండి ధరలు మంగళవారం ఉదయం మరోసారి పడిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలలో మారోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం తగ్గిన సిల్వర్ రేట్స్ తో దేశీయ  మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.687 ఉండగా.. కేజీ ధర రూ.68,700గా ఉంది. ఇక దేశంలోని పలు నగరాల్లో వెండి ధరలలో మార్పులు జరిగాయి.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.687 ఉండగా.. కేజీ ధర రూ.68,700గా ఉంది. ముంబైలో 10 గ్రాముల ధర రూ.687 గా ఉండగా.. కిలో వెండి ధర రూ.68,700గా కొనసాగుతుంది. . చెన్నైలో 10 గ్రాముల ధర రూ.10 గ్రాముల ధర రూ.738గా ఉండగా.. కిలో వెండి ధర రూ.73,800గా ఉంది. బెంగుళూరులో 10 గ్రాముల ధర రూ.687గా ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ.68,700గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.738 ఉండగా.. కిలో వెండి ధర రూ.73,800గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ.738 ఉండగా.. కిలో వెండి ధర రూ.73,800గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26-04-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News