Hyderabad: హైదరాబాద్‌లో అత్యాధునిక చర్మ సంరక్షణ కేంద్రం “డిఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్” గ్రాండ్ ప్రారంభం

Hyderabad: హైదరాబాద్‌లో డిఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్ ప్రారంభం సందర్భంగా సుమారు 100 మందికి చర్మ సంరక్షణ “డెర్మటాలజీ & ఏస్థెటిక్స్” పై ఉచిత సెషన్లు నిర్వహించారు.

Update: 2026-03-16 12:30 GMT

Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్ పోస్ట్ లో అత్యాధునిక చర్మ - సౌందర్య చికిత్సా సేవలను అందించే డిఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్ క్లినిక్‌ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. డిఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్ ను డాక్టర్ ప్రియాంకా రెడ్డి స్థాపించారు. ఇక్కడ ఆధునిక డెర్మటాలజీ చికిత్సలు, ఏస్థెటిక్స్ సేవలను అందిస్తారు .  చర్మ ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ క్లినిక్ పనిచేస్తుంది .  అత్యాధునిక వైద్య సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌లో నిపుణుల సలహాలు అందిస్తూ, వైద్య - సౌందర్య చర్మ సమస్యలకు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సలు అందించనున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంకా రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఆధునిక డెర్మటాలజీ సేవలను అందించేందుకు ఈ క్లినిక్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. శాస్త్రీయంగా నిరూపితమైన చికిత్సలు, సురక్షితమైన ఏస్థెటిక్స్ ప్రక్రియలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన చర్మ సంరక్షణ పరిష్కారాలను అందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎవరికి చర్మానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరమో వాళ్ళ కి తగినట్టుగా కేవలం అవసరమైనంత మేరకు మాత్రమే తాము చికిత్స అందిస్తామని చెప్పారు .  

అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ క్లినిక్‌లో వివిధ రకాల డెర్మటాలజీ, ఏస్థెటిక్స్ చికిత్సలు సమగ్రంగా అందించడం జరుగుతుందని డాక్టర్ ప్రియాంక రెడ్డి చెప్పారు .  అలాగే ,  సౌకర్యవంతమైన, ఆధునిక వాతావరణంలో నిపుణుల చేత ఉత్తమ సేవలను పొందగలుగుతారని వివరించారు .  ఈ క్లినిక్ ద్వారా తాము హైదరాబాద్‌లో చర్మ, సౌందర్య సంరక్షణలో కొత్త మైలురాయిగా నిలుస్తామని పేర్కొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మందికి ప్రత్యేక మాస్టర్‌క్లాస్, కన్సల్టేషన్ సెషన్ ఉచితంగా నిర్వహించారు . ఈ సెషన్‌లో పాల్గొన్న రికి తాజా డెర్మటాలజీ అభివృద్ధులు, చర్మ పునరుజ్జీవనం (Skin Rejuvenation), ఆధునిక ఏస్థెటిక్స్ చికిత్సల గురించి అవగాహన కల్పించారు .  అలాగే నిపుణులతో ప్రత్యక్షంగా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ క్లినిక్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, చర్మ సంరక్షణ, బ్యూటీ రంగ నిపుణులు పాల్గొన్నారు.

Similar News