Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

Gold Rate: తాజాగా దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

Update: 2021-04-14 01:23 GMT

 Gold Rate:(File Image)

Gold Rate: దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత 10రోజుల్లో బంగారం ధరలు 2సార్లు తగ్గగా 7సార్లు పెరిగాయి. ఒకసారి స్థిరంగా ఉన్నాయి. మొన్న రూ.150 పెరిగిన బంగారం ధరలు... నిన్న రూ.160 తగ్గాయి.

22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 10 గ్రాములు రూ.43,400 ఉంది. నిన్న ధర రూ.150 తగ్గింది. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.34,720 ఉంది. నిన్న ధర రూ.120 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,340 ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.47,350 ఉంది. నిన్న ధర రూ.160 తగ్గింది. తులం బంగారం ధర రూ.37,880 ఉంది. నిన్న ధర రూ.128 తగ్గింది. ఒక్క గ్రాము ధర రూ.4,735 ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడలో ధరలు ఒకేలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,870 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,760 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.47,700 వద్ద కొనసాగుతోంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,350 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 వద్ద ఉంది. అలాగే విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,400 ఉండగా,24 క్యారెట్ల రూ.47,350 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు..

గత 13 రోజుల్లో వెండి ధర కేజీకి రూ.4,600 పెరిగింది. నిన్న స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.71,900 ఉంది. అలాగే... వెండి 8 గ్రాములు (తులం) కావాలంటే దాని ధర రూ.575.20 ఉంది. ఒక్క గ్రాము వెండి ధర రూ.71.90 ఉంది. గత 6 నెలలతో పోల్చితే... అప్పుడప్పుడూ తగ్గుతూ ఉన్నా... ఓవరాల్‌గా వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 6 నెలల కిందట అక్టోబర్ 14న వెండి ధర కేజీ రూ.62,000 ఉంది. ఇప్పుడు రూ.71,900 ఉంది. అంటే రూ.9,900 పెరిగింది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 14-04-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.

Tags:    

Similar News