Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్..నేటి వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: భగ్గుమన్న బంగారం ధరలు..90వేలు దాటిన తులం పసిడి
Today Gold Rate: బంగారం ధరలు గత రెండు రోజులుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్నా ఆదివారం, సోమవారంల్లో స్వల్పంగా తేడా మాత్రమే కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే బంగారం ధర మరింత పెరిగింది. రానున్న రోజుల్లో బంగారం ధర రూ. 90వేలకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్, ఇతర పరిస్థితులు బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి. అయితే రోజురోజుకూ ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో బంగారం ప్రియులకు అది మింగుడు పడటం లేదు. శుభకార్యాలు, ఇతర వేడుకలకు బంగారం కొనాలని భావించినా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
నేడు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78, 769 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 85,930 పలుకుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 78, 907 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,080గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 035కి చేరుకుంది. 24క్యారెట్ల తులం బంగారం ధరరూ. 86,220దగ్గర కొనసాగుతోంది. వెండి ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 96,290గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ. 96,460కి చేరుకుంది. హైదారాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ. 96,610వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇవే..
చెన్నై- రూ.79,136, రూ.86,330
పుణె- రూ.78,907 రూ.86,080
భోపాల్- రూ.78,989, రూ.86,170
ముంబై- రూ.78,907, రూ.86,080
భువనేశ్వర్- రూ.78,925, రూ.86,100