Today Gold Rate: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజు వ్యవధిలోనే బంగారం ధరలు మళ్లీ అప్ ట్రెండ్ దిశగా దూసుకుపోతున్నాయి. మంగళవారం ఢిల్లీలో 99.9శాతం స్వచ్చత బంగారం ధర రూ. 300 పెరిగింది. 10 గ్రాములకు రూ. 88.500కు చేరుకుంది. 99.5శాతం స్వచ్చత బంగారం రూ. 300 పెరిగి రూ. 88,100కు చేరుకుంది. గత శుక్రవారం బంగారం రూ. 1,300 పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 89,400 నమోదు చేసింది. సోమవారం అమ్మకాల ఒత్తిడికి రూ. 1,200 నష్టంతో రూ. 88,200 వరకు దిగివచ్చింది.
అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా బంగారం లాభపడినట్లు ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ వెల్లడించింది. వెండి ధర కూడా కిలో రూ. 800 లాభపడింది. రూ. 99,000కు చేరుకుంది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం, వెండి లాభపడ్డాయి. ఏప్రిల్ నెల గోల్డ్ కాంట్రాక్ట్ రూ. 435 పెరిగి రూ. 84,490 కు చేరింది. వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రూ. 439 పెరిగి రూ. 96,019కి చేరింది.