Today Gold Rate: తగ్గిన బంగారం.. భారీగా పెరిగిన వెండి.. ధరలు ఎలా ఉన్నాయంటే?

Today Gold Rate: దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఈ క్రమంలోనే బంగారం ధర తగ్గితే..వెండి ధర మాత్రం ఏకంగా ఒక్కరోజులోనే 8900 పెరిగింది.

Update: 2025-03-16 03:30 GMT

Today Gold Rate: దేశంలో బంగారం ప్రియులకు కాస్త ఊరట లభించిందనే చెప్పవచ్చు. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ రూ. 89వేల స్థాయిలోనే ఉన్న పసిడి ధరలను చూసి సామాన్యులకు షాక్ అవుతున్నారు. ఇదే సమయంలో వచ్చిన పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సి వస్తుంది. అంతేకాదు పెరిగిన ధర నేపథ్యంలో గతంతో పోల్చితే కొనుగోళ్లు కూడా తగ్గాయని ఆయా వ్యాపార వర్గాలు అంటున్నాయి.

ఈ క్రమంలోనే మార్చి 16,2025 న హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89, 670కి చేరుకుంది. ఈ ధర నిన్నటితో పోల్చితే రూ. 120కి తగ్గింది. 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 82,220కి చేరింది. ఇక ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 89, 820 స్థాయికి చేరుకుంది. 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 82,350కి చేరింది.

దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధలు ఎలా ఉన్నాయంటే ?

చెన్నైలో రూ. 89,670, రూ.82,200

న్యూఢిల్లీలో రూ. 89,820, రూ.82,350

ముంబైలో రూ. 89,670, రూ.82,200

కోల్‌కతాలో రూ. 89,670, రూ.82,200

బెంగళూరులో రూ. 89,670, రూ.82,200

Tags:    

Similar News