RBI: గుడ్‌న్యూస్‌.. ఆర్బీఐ ఈ పరిమితిని పెంచింది..!

RBI: గుడ్‌న్యూస్‌.. ఆర్బీఐ ఈ పరిమితిని పెంచింది..!

Update: 2022-06-09 06:30 GMT

RBI:గుడ్‌న్యూస్‌.. ఆర్బీఐ ఈ పరిమితిని పెంచింది..!

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)సహకార బ్యాంకులు ఇచ్చే గృహ రుణాల పరిమితిని 100% కంటే ఎక్కువ పెంచింది. ఇప్పుడు సహకార బ్యాంకులు ఖాతాదారులకు రూ.1.40 కోట్ల వరకు గృహ రుణాలు అందించగలవు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఆర్బీఐ ఈ నిర్ణయం తర్వాత ఇప్పుడు పట్టణ సహకార బ్యాంకులు 70 లక్షల రూపాయలకు బదులుగా 1.40 కోట్ల రూపాయల వరకు, గ్రామీణ సహకార బ్యాంకులు 30 లక్షల రూపాయలకు బదులుగా 75 లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వవచ్చు.

ఈ నిర్ణయంపై ఆర్‌బీఐ గవర్నర్‌ మాట్లాడుతూ.. గతసారి సహకార బ్యాంకుల రుణ పరిమితిని పెంచినప్పటి నుంచి ఇప్పుడు ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఇల్లు కొనాలంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. కస్టమర్ల ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ సహకార బ్యాంకు ఖాతాదారులకు ఇచ్చే రుణ పరిమితిని 100 శాతంపెంచింది.

హౌసింగ్ ప్రాజెక్టులను ప్రారంభించిన బిల్డర్లకు గ్రామీణ సహకార బ్యాంకులు ఇప్పుడు రుణాలు ఇవ్వగలవని ఆర్‌బిఐ తెలిపింది. గృహనిర్మాణ రంగానికి రుణ సదుపాయం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ నిర్ణయంతో గృహ నిర్మాణ రంగానికి సహకార బ్యాంకుల నుంచి వచ్చే రుణాల ప్రవాహం మరింత పెరగనుందన్నారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్లీ రెపో రేటును పెంచింది. ఈసారి 50 బేసిస్ పాయింట్లు (.50 శాతం) పెరిగింది.

Tags:    

Similar News