తొలి సెషన్ లో లాభాల బాటన సరికొత్త రికార్డులు..

Update: 2021-02-13 04:20 GMT

Representational Image

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారంలో మూడు రోజులు లాభాల బాటన పరుగులు తీయగా..మిగతా రెండు సెషన్లలోనూ అక్కడికక్కడే ముగిశాయి తాజా వారంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లేదా ఎఫ్‌ఐఐలు 5,871.25 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు లేదా డిఐఐలు 5,642.08 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు గణాంకాలు వెల్లడించాయి వారం ప్రాతిపదికన చూస్తే బిఎస్ఇ సెన్సెక్స్ 812.67 పాయింట్లు లేదా 1.6 శాతం మేర ఎగసి 51,544 పాయింట్ల వద్దకు చేరగా, నిఫ్టీ 239 పాయింట్లు లేదా 1.6 శాతం పుంజుకుని 15,163 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.

భారత ఈక్విటీ మార్కెట్లు తొలి సెషన్ లో లాభాల బాటన సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి వరుసగా రెండో వారం సూచీలు పరుగులు తీయడంతో రికార్డుల జోరు కొనసాగింది. ఆర్థికవృద్ధి రికవరీపై ఆర్‌బీఐ సానుకూల వ్యాఖ్యలతో తొలి సెషన్ ను మార్కెట్లు భారీ లాభాలతో ఆరంభించి అదే జోరును కొనసాగించాయి.రెండో సెషన్ కి వచ్చేసరికి ఆరంభ ట్రేడింగ్ లో రికార్డుల మోత మోగించిన సూచీలు మదుపర్ల లాభాల స్వీకరణ ఫలితంగా ఫ్లాట్ గా ముగిశాయి. మూడో సెషన్ లోనూ దేశీ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. కేంద్ర బడ్జెట్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన తదనంతరం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. నాలుగో సెషన్ లోనూ భారత ఈక్విటీ మార్కెట్లు లాభాలను అందించాయి..ఇక వారాంతాన సూచీలు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 13 పాయింట్ల స్వల్ప లాభంతో 51,544 వద్దకు చేరగా నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప నష్టంతో 15,163 వద్ద స్థిరపడ్డాయి.

తాజా వారంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల మద్దతు కారణంగా దేశీ స్టాక్ మార్కెట్ ఒక్క శాతం మేర పుంజుకుని స్థిరపడింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ తో రూపాయి మారకం విలువ 17 పైసలు మేర లాభంతో 72.75 వద్ద స్థిరపడింది.

Tags:    

Similar News