టెస్లాలో ఉద్యోగాల నియామాకాలు: ఎలా అప్లయ్ చేయాలంటే?
Tesla Hires in India: ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇండియాలో తన వ్యాపార కార్యకలాపాల ప్రారంభం కోసం నియామకాలను చేపట్టనున్నారు.
టెస్లాలో ఉద్యోగాల నియామాకాలు: ఎలా అప్లయ్ చేయాలంటే?
Tesla Hires in India: ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇండియాలో తన వ్యాపార కార్యకలాపాల ప్రారంభం కోసం నియామకాలను చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ అనౌన్స్ మెంట్ చేసింది. గత వారంలోనే అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మస్క్ బేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత మస్క్ సంస్థ ఇండియాలో తన కార్యకలాపాల కోసం జాబ్స్ రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
13 రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్
సర్వీస్ అడ్వైజర్
పార్ట్స్ అడ్వైజర్
సర్వీస్ టెక్నీషియన్
సర్వీస్ మేనేజర్
టెస్లా అడ్వైజర్
స్టోర్ మేనేజర్
బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్
కస్టమర్ సపోర్ట్ సూపర్‌వైజర్
కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్
డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
ఇన్‌సైడ్ సేల్స్ అడ్వైజర్
కన్స్యూమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
టెస్లాలో ఉద్యోగాలకోసం ఆ సంస్థ అధికారిక వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకోవచ్చు. ముంబై, దిల్లీ చోట్ల ఉద్యోగులను రిక్రూట్ మెంట్ చేసుకోనున్నారు. కస్టమర్ ఎంగేజ్ మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్టు టెస్లా తెలిపింది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో టెస్లా కంపెనీ అగ్రగామిగా ఉంది. ఇండియాలో టెస్లా కంపెనీ తన వాహనాల విక్రయాల కోసం 2021 నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అయితే అనేక కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఇండియాలోనే ఈ వాహనాల తయారీతో ఇక్కడ దొరికే విడిభాగాలు కొనుగోలు చేయాలన్న భారత్ కండీషన్ కు మస్క్ అంగీకరించలేదు. దీంతో టెస్లా ఎంట్రీ ఆలస్యమైంది. టెస్లా సంస్థ రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఆశలు చిగురించాయి.