బంధన్‌ బ్యాంకుతో జత కట్టిన టాటామోటర్స్.. ఇప్పుడు సరసమైన ధరలకు కారు లోన్‌..

Tata Motors: కారు రుణం కోసం ఎదురు చూసే కస్టమర్లకు టాటామోటర్స్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

Update: 2021-12-16 02:15 GMT

బంధన్‌ బ్యాంకుతో జత కట్టిన టాటామోటర్స్.. ఇప్పుడు సరసమైన ధరలకు కారు లోన్‌..

Tata Motors: కారు రుణం కోసం ఎదురు చూసే కస్టమర్లకు టాటామోటర్స్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్యాసింజర్‌ వాహనాల కొనుగోలుకు బంధన్‌ బ్యాంకుతో జత కట్టింది. తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తుంది. కంపెనీ ప్రకారం ఈ ఒప్పందం సహాయంతో కస్టమర్లు చాలా సులభంగా రుణాలు పొందగలుగుతారు. ఒప్పందం ప్రకారం బంధన్ బ్యాంక్ టాటా మోటార్స్ కస్టమర్లకు 7.5 శాతం ప్రారంభ రేటుతో రుణాలను అందజేస్తుందని టాటా మోటార్స్ తెలిపింది. వాహనం ఆన్-రోడ్ ధరలో 90 శాతం వరకు ఫైనాన్స్ అందిస్తుంది. కస్టమర్లు 7 సంవత్సరాల పాటు రుణం తీసుకోగలుగుతారు.

ఇది వినియోగదారులపై EMI భారాన్ని మరింత తగ్గిస్తుంది. అదే సమయంలో రుణగ్రహీతలు రుణాన్ని ముందుగానే క్టోజ్‌ చేయవచ్చు. అదనపు ఛార్జీలు పడకుండా పాక్షికంగా కూడా చెల్లించవచ్చు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ రంజన్ అంబ మాట్లాడుతూ.. "ఈ భాగస్వామ్యం మా ఫైనాన్స్ ఈజీ ఫెస్టివల్‌లో ఒక భాగం. తద్వారా ప్రజలు కారు కొనుగోలు చేయడం చాలా సులభం అవుతుంది" అన్నారు. కారు రుణాలపై ఇతర బ్యాంకుల వడ్డీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బ్యాంకులు ప్రస్తుతం 7 శాతం ప్రారంభ రేటుతో కారు రుణాలను అందిస్తున్నాయి. గరిష్టంగా 8 సంవత్సరాల కాలానికి రుణాలు అందిస్తున్నారు. మీరు లగ్జరీ కారును పొందాలనుకుంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు వెళ్లాలి. మరోవైపు మీకు 100 శాతం ఫైనాన్స్ కావాలంటే ICICI బ్యాంక్ ఆఫర్ మీకు మెరుగ్గా ఉంటుంది, వ్యవసాయ రంగానికి సంబంధించిన కస్టమర్‌లు SBI ఆఫర్‌లను తీసుకుంటే బాగుంటుంది. మీకు చిన్న మొత్తం అవసరమైతే యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ మీకు ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. 

Tags:    

Similar News