Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market: 465 పాయింట్లు కోల్పోయి 21,571 వద్ద ముగిసిన నిఫ్టీ

Update: 2024-01-17 10:45 GMT

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. సెన్సెక్స్ 1,628 పాయింట్లు నష్టపోయి 71వేల 500 వద్ద ముగిసింది. ఇక.. నిప్టీ 465 పాయింట్లు కోల్పోయి 21వేల 571 వద్ద ముగిసింది.

పతనానికి ప్రధాన కారణం బ్యాంకింగ్ షేర్ల విక్రయం ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో సహా చాలా బ్యాంకింగ్ లేదా ఎన్‌బీఎఫ్‌సీల షేర్లలో పెద్ద పతనం కనిపించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 7 శాతానికి పైగా పడిపోయాయి. కోటక్, యాక్సిస్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ వంటి పెద్ద బ్యాంకులు లేదా ఎన్‌బిఎఫ్‌సిల షేర్లు కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి.

Tags:    

Similar News