Gold Price Crash: బంగారం ధరల్లో భారీ పతనం? తులం రూ. లక్షకు చేరే ఛాన్స్.. కారణాలివే!
Gold Price Crash: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు త్వరలోనే బ్రేక్ పడనుందా? ప్రస్తుతం రూ. 1.60 లక్షల వద్ద ఉన్న తులం బంగారం ధర మళ్ళీ లక్ష రూపాయల మార్కుకు దిగిరానుందా?
Gold Price Crash: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు త్వరలోనే బ్రేక్ పడనుందా? ప్రస్తుతం రూ. 1.60 లక్షల వద్ద ఉన్న తులం బంగారం ధర మళ్ళీ లక్ష రూపాయల మార్కుకు దిగిరానుందా? అంటే అవుననే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2027 నాటికి బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని ప్రముఖ నిపుణులు అనుజ్ గుప్తా, అమిత్ గోయల్ అంచనా వేస్తున్నారు.
ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలు:
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో వచ్చే జూన్ నాటికి యుద్ధం నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధ భయంతోనే పెట్టుబడిదారులు సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి బంగారం వైపు మొగ్గు చూపారు. శాంతి నెలకొంటే ఈ పెట్టుబడులు మళ్లీ వెనక్కి వస్తాయి.
డాలర్ ఆధిపత్యం: రష్యా మళ్లీ అమెరికా డాలర్లతో వాణిజ్యం పునఃప్రారంభిస్తే, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల గోల్డ్ బాండ్ల కంటే డాలర్ ఆధారిత బాండ్లకే ప్రాధాన్యత పెరిగి బంగారం ధరలు తగ్గుతాయి.
బ్రిక్స్ (BRICS) దేశాల ప్రభావం: ప్రస్తుతం ప్రపంచ పసిడి నిల్వల్లో 20% బ్రిక్స్ దేశాల వద్దే ఉన్నాయి. ఉత్పత్తిలోనూ ఈ దేశాల వాటా 50% పైనే ఉంది. డాలర్‌కు మద్దతు పెరిగితే, కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు ఆపివేసే అవకాశం ఉంది.
భవిష్యత్తు అంచనాలు:
గతేడాది బంగారం ధరలు ఏకంగా 70% మేర పెరిగి రికార్డు స్థాయి రూ. 1.80 లక్షలను తాకాయి. అయితే, అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర ప్రస్తుతం ఉన్న 5,000 డాలర్ల నుండి 3,000 డాలర్లకు పడిపోతే, దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 90,000 నుంచి రూ. 1,00,000 మధ్య స్థిరపడొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.