Stock Market: నష్టాల బాటన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు * అందిపుచ్చుకున్న దేశీ సూచీలు
Representational Image
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు తాజా సెషన్ లో నష్టాల బాటన ట్రేడింగ్ ఆరంభించాయి.. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 290 పాయింట్లు మేర క్షీణించగా నిఫ్టీ 14,470 మార్క్ దిగువకు చేరింది. దేశీయంగా పెరుగుతున్న కోవిడ్ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాల నేపధ్యంలో దేశీ మార్కెట్ లో అప్రమత్తత కొనసాగుతోంది. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 376 పాయింట్లు కోల్పోయి 48,804 వద్దకు చేరగా. నిఫ్టీ 105 పాయింట్లు మేర నష్టంతో 14,444 వద్ద స్థిరపడ్డాయి.