Stock Market Updates: ఈరోజూ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Stock Market Updates: * రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ .. * సెన్సెక్స్ 445 ,నిఫ్టీ 134 పాయింట్లు అప్.. * ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లు జోరు..
Representational Image
దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 445 పాయింట్లు జంప్‌చేసి 48,538 వద్దకు చేరగా నిఫ్టీ సైతం 134 పాయింట్లు ఎగసి 14,271 వద్ద ట్రేడవుతోంది. పది రోజుల వరుస ర్యాలీకి గత రెండు రోజుల్లో బ్రేక్ పడినప్పటికీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువ వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటుకు బలాన్నిఇస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.