Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట
Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యం... * సెన్సెక్స్ 153 పాయింట్లు.. నిఫ్టీ 54 పాయింట్లు అప్
Representational image
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన పయనిస్తున్నాయి..దేశీ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 68 పాయింట్లు .. నిఫ్టీ 26 పాయింట్లు మేర లాభాలను నమోదు చేశాయి.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 153 పాయింట్లు ఎగసి 53,033 వద్దకు చేరగా.. నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 15,888 వద్ద కదలాడుతున్నాయి..