Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
నిన్నటి నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు 600 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ
Representational Photo
Stock Market: స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి కోలుకొని లాభాల బాట పట్టాయి. కీలక రంగాల్లో వెల్లువెత్తుతున్న కొనుగోళ్ల మద్దతుతో నేటి ట్రేడింగ్‌ను లాభాలతో మొదలుపెట్టాయి. అటు ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా ఉండటం సూచీల సెంటిమెంట్‌ను మరింత బలపర్చింది. దీంతో మార్కెట్లు ఉత్సాహంగా కదలాడుతున్నాయి. 600 పాయింట్ల లాభంలో సెన్సెక్స్... 200 పాయింట్ల లాభంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి.