Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట
Equity Market: గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యం.. * ఆరంభ ట్రేడింగ్ లో సరికొత్త గరిష్టాలకు సూచీలు
Representational Image
Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన కొనసాగుతున్నాయి..ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 300 పాయింట్లు మేర జంప్ చేయగా..నిఫ్టీ ఆల్ టైమ్ హై రికార్డ్ ను నమోదు చేసింది..ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగసి 51,436 వద్దకు చేరగా , నిఫ్టీ 108 పాయింట్ల లాభంతో 15,446 వద్ద కదలాడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సంకేతాలతో పాటు కోవిడ్ కొత్త కేసులు ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే తక్కువగా నమోదు కావడం మార్కెట్ పై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి.