Stock Market: అక్టోబర్‌ను నష్టాల్లో ప్రారంభించిన స్టాక్‌మార్కెట్లు
Stock Market: 638 పాయింట్లు నష్టంతో 56,788 పాయింట్ల దగ్గర ముగిసిన సెన్సెక్స్
Stock Market: అక్టోబర్‌ను నష్టాల్లో ప్రారంభించిన స్టాక్‌మార్కెట్లు
Stock Market: నష్టాలతో స్టాక్‌మార్కెట్లు.. అక్టోబర్ నెలను ప్రారంభించాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, చమురు ధరలు పెరగడంతో.. దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్.. చివరకు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 638 పాయింట్లు కోల్పోయి.. 56 వేల 788 పాయింట్ల దగ్గర ముగియగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో.. 16 వేల 887 దగ్గర ముగిసింది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో అస్థిరత కొనసాగుతుండటంతో.. రోజంతా ఏ సమయంలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. దీంతో చివరకు సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.