Stock Market: భారీ లాభాల్లో భారత ఈక్విటీ మార్కెట్లు
Stock Market: సెన్సెక్స్ 514 పాయింట్లు జంప్ చేసి 51,937 వద్ద క్లోజ్ * నిఫ్టీ 147 పాయింట్లు ఎగసి 15,582 వద్ద స్థిరం
Representational Image
Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 514 పాయింట్లు జంప్ చేసి 51,937 వద్దకు చేరగా.. నిఫ్టీ 147 పాయింట్లు ఎగసి 15,582 వద్ద స్థిరపడ్డాయి. తాజా వారం తొలి సెషన్ లో ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించిన దేశీ సూచీలు... క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో ఒక దశలో 200 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోగా..తిరిగి లాభాల్లోకి మళ్లిన సూచీలు..అదే బాటన దూసుకెళ్తూ చివరకు భారీ లాభాలను అందించాయి..గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాలతో పాటు కోవిడ్ కొత్త కేసులు గణనీయంగా తగ్గడం తదితర అంశాలు సానుకూల ప్రభావాన్ని చూపాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు