Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాల ముగింపు
Equity Market: మార్కెట్లో వరుసగా రెండో రోజు బలహీన ధోరణి.. * ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు..
representational Image
Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి..దేశీయ స్టాక్‌మార్కెట్లో వరుసగా రెండో రోజు బలహీన ధోరణి ఫలితంగా సూచీలు ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి.. చివరకు సెన్సెక్స్ 465 పాయింట్ల నష్టంతో 48,253 వద్ద, నిఫ్టీ 137 పాయింట్లు పతనమై 14,496 వద్ద స్థిరపడ్డాయి..
గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు దేశంలో కొవిడ్-19 కేసుల పెరుగుదల, స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్‌లు, వ్యాక్సిన్‌ల కొరత వంటి అంశాలు మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపినట్లయిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.